కేసుల మాఫీ కోసమే ఢిల్లీకి చంద్రబాబు

()బాబు పబ్లిసిటీ పిచ్చి మానుకోవాలి
()హోదాను పక్కనబెట్టి పుష్కరాల ఆహ్వానమా
()రాష్ట్ర ప్రజల కోరిక మేరకు హోదా కోసం పోరాడాలి
()వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ః ప్రత్యేకహోదాను పక్కనబెట్టి  కేవలం తన కేసులు మాఫీ చేయించుకునేందుకే.... చంద్రబాబు కోట్లాది రూపాయలు దుబారా చేస్తూ ప్రత్యేక ఫ్లైట్లలో ఢిల్లీ చుట్టు తిరుగుతున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే తమ జీవితాలు బాగుపడుతాయని ప్రతీ ఒక్కరూ కోరుకుంటుంటే...బాబు మాత్రం తన సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సంది పోయి.... రాష్ట్రపతిని, ప్రధానిని పుష్కరాలకు ఆహ్వానించేందుకే ఢిల్లీకి వెళుతున్నానని చెప్పడం దారుణమన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. 

మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..

()రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థి, పౌరులు ప్రత్యేకహోదాను కోరుకుంటున్నారు. తమ జీవితాలు ఏవిధంగా బాగుపడుతాయని ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ హోదాపై స్పష్టంగా తన వాదన వినిపించకుండా మాట తప్పింది.
()బాబు ఇప్పటికే 22 సార్లు ఢిల్లీ వెళ్లారు. ఇది 23వ సారి. ఢిల్లీకి వెళ్లేది హోదా కోసం కాదు. అరుణ్ జైట్లీ మీద రక్తం మరిగి కాదు. కేంద్రానికి అల్టిమేటం ఇవ్వడానికి కాదు. పుష్కరాలకు ఆహ్వానించేందుకు వెళుతున్నానని బాబు చెప్పడం బాధాకరం.  లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో అన్ని పార్టీలు హోదాకు సహకరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాల్సింది పోయి బాబు హోదాను నీరుగారుస్తున్నాడు. 
()పండుగలు, ప్రతీ 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను సంప్రదాయం ప్రకారం చేస్తాం. కానీ వాటిని కూడా నేనే చేస్తున్నానని బాబు చెప్పుకోవడం హాస్యాస్పదం. పుష్కరాలు ముఖ్యమైనా దాన్ని ఇంత పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరమేంటి బాబు. 
() గోదావరి పుష్కరాల్లో బాబు కుటుంబం స్నానానికి వెళ్లి 45 నిమిషాల షూటింగ్ కోసం 30 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. దానిపై బాబుకు కనీసం పశ్చాతాపం కూడా లేదు. 
()చనిపోయిన కుటుంబాలు ఆ బాధ నుంచి బయటపడకముందే బాబు మళ్లీ కృష్ణా పుష్కరాల పబ్లిసిటీ మొదలుపెట్టారు. గోదావరి ఘటనకు సంబంధించి  సోమయాజులు కమిటీ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వకుండా ఎందుకు గడువు పెంచుకుంటూ పోతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
()బాబు పుష్కర ఘాట్ లో ఎక్కువసేపు ఉడండం వల్ల, భక్కులను ఆపడం వల్లే తొక్కిసలాట జరిగిందని కలెక్టర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. 
బాబు తనకు తాను ఆలోచన చేసుకోవాలి. తన పబ్లిసిటీ పిచ్చి మానుకోవాలి.
() 108, 104, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, హౌసింగ్ సహా అనేక పథకాలు ప్రవేశపెట్టి మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు.
()అవేమీ చేయకుండా రొటీన్ గా వచ్చే దసరా, సంక్రాంతి, పుష్కరాలను కూడా నేనే ప్రారంభోత్సవం చేస్తానని బాబు చెప్పడం విడ్డూరం
()సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేవాడివే ఐతే 40 గుళ్లను ఎందుకు కూల్చావ్ బాబు. ఎటువంటి ఆటంకాలు లేకపోయినా ఆలయాలు, మసీదులను, చర్చిలను కూల్చడం న్యాయమా..? దేవాతమూర్తుల అనుగ్రహం కావాలంటూనే వాటినే కూలగొడుతున్నావ్. పుష్కరాల పేరుతో ఎన్ని ఆలయాలను, మసీదులను, చర్చిలను కూలగొట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలి.
() మీ భాగస్వామ్య పక్షమైన బీజేపీ కూడా రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని అంటున్నారు. దానికి ఎందుకు సమాధానం చెప్పరు.
()గంటలకొద్దీ ప్రెస్ మీట్ పెట్టి సంబంధం లేని విషయాల గురించి మాట్లాడుతారు. 
()నారక్తం మరిగిపోతోంది అని ఊదరగొట్టారు. ఓసారి హోదానే జీవన్మరణ సమస్య అంటావ్. మళ్లీ నీవే దాన్ని డైల్యూట్ చేస్తావ్. హోదా ఏమైనా సంజీవనా అని మాట్లాడుతావ్. హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని మాట్లాడుతావ్. 
()బాబు మాటలు గ్రహించి టీడీపీకి హోదా ఇంట్రస్ట్ లేనట్టుందని బీజేపీ పక్కనబెట్టే పరిస్థితికి వచ్చింది. మీ ఉద్దేశ్యమేంటో మీకే తెలియదు. రెండు నాల్కల ధోరణి మానుకోవాలి. 
()రాష్ట్ర ప్రజల మనోభాలు తెలుసుకోకుండా పుష్కరాలను నేనే ఆరంభిస్తా. ప్రారంభిస్తానని మాట్లాడుతున్నావ్. ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని హోదా కోసం ఎందుకు నిలదీయలేకపోతున్నావో. ఎందుకు అల్టిమేట్ ఇవ్వడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి
()ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో బాబు ఆలోచన చేయాలి
()ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్తే రాష్ట్రపతి పొగిడారని బాబు తనకు తానే పబ్లిసిటీ చేసుకోవడం హాస్యాస్పదం. మరి అలా పొగిడినప్పుడు ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వానికి నచ్చజెప్పాలని  రాష్ట్రపతిని ఎందుకు అడగడం లేదు బాబు.
()బాబు తనపై ఉన్న కేసులను  మాఫీ చేయించుకోవడం కోసమే ఢిల్లీకి వెళుతున్నారు.  రాష్ట్రంలో నాపై చర్యలు తీసుకునే ధైర్యం ఎవరికుంది అంటాడు. డిల్లీకి వెళ్లి వంగి వంగి శాలువాలు కప్పుతాడు.
()రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు, పబ్లిసిటీపైనే బాబు మక్కువ చూపిస్తున్నాడు
()అఖిలపక్షం ఏర్పాటు చేయమంటే చులకనగా మాట్లాడుతారు. ప్రతిపక్ష నేత గురించి మెచూరిటీ లేదని కామెంట్ చేస్తారు.
() బాబు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. వైయస్ జగన్ కేవలం తన తండ్రి ఫోటో పెట్టుకొని మహానేత చేసినవి కొనసాగిస్తామని చెప్పి ప్రజల ద్వారా సింగిల్ గా పోటీ చేసి 67మందిని గెలిపించుకున్నారు. 
() కానీ, బాబు అందరినీ కలుపుకొని అమలు గానీ హామీలిచ్చి మోసం చేసి ఒక్క పర్సెంట్ తేడాతో గెలిచారు. 
()ప్రతిపక్ష నాయకున్ని అగౌరవించి మాట్లాడే విధానం బాబు మానుకోవాలి. 
()ప్రెస్ మీట్ లలో సీఎస్, డీజీపీలను పక్కనెబెట్టుకొని మాట్లాడడమేంటి. పార్టీయే ప్రభుత్వమన్న విధంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బాబు ఇతరులపై విమర్శలు చేయడం దుర్మార్గం
()ప్రత్యేక ప్లైట్ లలో ఢిల్లీకి వెళతారు. కోట్లాది రూపాయలు హోటల్ బిల్లులు చేస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారు. రాష్ట్రపతి పొగిడారని బయటకు చెప్పుకుంటూ వాస్తవాలను కప్పేస్తున్నారు. 
()రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని హోదా కోసం పోరాడాలి.
()ప్రధాన ప్రతిపక్షంగా హోదా కోసం ఎన్నో పోరాటాలు చేశాం. ప్రతీసారి మమ్ముల్ని అవహేళన చేశారు. బాబు మీలాగ రెండు నాల్కల ధోరణి మాకు లేదు. నీవు ఏ దేశాలు తిరగనక్కర్లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే  పారిశ్రామికవేత్తలు వారంతట వారే వస్తారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.


Back to Top