బాబుకు పదవి తప్ప ప్రజా సంక్షేమం పట్టదు

నెల్లూరు: పదవి తప్ప ప్రజా సంక్షేమం పట్టని వ్యక్తి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ, సీనియర్‌ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో హోదా 15 సంవత్సరాలు సాధిస్తామని ప్రగల్భాలు పలికి.. అధికారంలోకి వచ్చిన తరువాత హోదా కంటే ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందంటూ ఆంధ్రరాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నాడన్నారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పోరాటాలు చేశారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ పోరాటాలు దేశమంతా చూస్తోందని గ్రహించి మళ్లీ యూటర్న్‌ తీసుకొని ప్యాకేజీ అన్న నోటితోనే హోదా కావాలంటూ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు చూస్తున్నాడన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించి చైతన్యపరచాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బూత్‌ కమిటీ సభ్యులదే కీలక పాత్ర అని చెప్పారు. తెలంగాణ ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్‌ ఇచ్చిన సర్వే అంతా అబద్ధమని మేకపాటి అన్నారు. చంద్రబాబు కలిసి మోసపోయామని ఢిల్లీ పెద్దలు బాధపడుతున్నారన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top