విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మళ్లీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలన వస్తుందని ఆటోడ్రైవర్ పేర్కొన్నారు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న అతను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఎన్నో రకాలుగా లబ్ధి పొందాడు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నారు. తన కుటుంబంలోప్రతి ఒక్కరికి మహానేత సంక్షేమ పథకాలు అందయాని పేర్కొన్నారు. గుండు చేయించుకుని నవరత్నాల పథకాలను వినూత్న రీతిలో ఆటో డ్రైవర్ ప్రచారం చేశారు. వినూత్నమైన ఇతని ప్రచారంతో ప్రజలకు నవరత్నాలపై అవగాహన కల్పించారు.