మంండల పరిషత్ సమావేశానికి హాజరు

తోటపల్లిగూడూరు: గురువారం జరగునున్న మండల పరిషత్‌ సమావేశానికి సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్థన్‌రెడ్డి హాజరుకానున్నట్లు ఎంపీడీఓ హేమలత తెలిపారు. ఆమె బుధవారం మాట్లాడుతూ గడిచిన మూడు నెలల కాలానికి సంబంధించి మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నామన్నారు. అలాగే మరో మూడు నెలల కాలానికి సంబంధించి జరగబోవు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాధనలకు ఈ సమీక్షా సమావేశంలో ఆమోదం తెలపడం జరుగుతుందన్నారు. గురువారం మద్యాహ్నం 3గంటలకు స్థానిక మండల పరిషత్‌ కార్యాయంలో జరుగునున్న ఈ మండల సమీక్షా సమావేశానికి అన్నీ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తప్పక హాజరు కావాలనీ ఎంపీడీఓ హేమలత సూచించారు.

తాజా ఫోటోలు

Back to Top