జగన్ వదిలిన బాణం అమ్ములపొదిలో చేరింది

‌నూజివీడు (కృష్ణా జిల్లా),

25 నవంబర్ 2013: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి వదిలిన బాణం తిరిగి అమ్ములపొదిలో చేరిందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. ఆనాడు శ్రీ జగన్ జై‌లులో ఉన్నారు కాబట్టే శ్రీమతి షర్మిల ప్రజల కోసం, పార్టీ తరఫున పాదయాత్ర చేశారని తెలిపారు. అవసరం అయినప్పుడు ఆమె మళ్లీ ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడులో సోమవారం జరిగిన వైయస్ఆర్‌‌ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో అంబటి రాంబాబు పాల్గొని మాట్లాడారు.

కుటుంబ సభ్యులను, నమ్మినవారిని నిలువునా మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడిదని అంబటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తప్పుడు ప్రచారంతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీయలేరని ఆయన అన్నారు. తమ పార్టీ సీమాంధ్రలో 150, తెలంగాణలో 25 సీట్లకు పైగా సాధిస్తుందని అంబటి విశ్వాసం వ్యక్తం చేశారు.

Back to Top