'అప్పుల తిప్పలతో కుదేలవుతున్న పత్తి రైతు'

కరీంనగర్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల కారణంగా పత్తి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి కుదేలైపోతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం కన్వీనర్‌ ఎం.వి.ఎస్‌. నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసమర్ధ పాలన వల్ల వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని నాగిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోని పత్తి కొనుగోలు కేంద్రాన్ని‌ బుధవారంనాడు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

క్వింటాలు పత్తి ఉత్పత్తికి రూ.5,742 ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేశారని, అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం రూ.3,900 మాత్రమే చెల్లిస్తున్నదని నాగిరెడ్డి విమర్శించారు. దివంగత మహానేత, ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పాలనలో పత్తి రైతులకు క్వింటా‌లుకు రూ.5,200 గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మోన్‌శాంటో కంపెనీ పత్తి విత్తనాల ధర రూ.1,650 ఉండగా కోర్టును ఆశ్రయించి రైతులకు సబ్సిడీపై రూ.6,50లకే అందించారని గుర్తు చేశారు.

మహానేత వైయస్‌ఆర్ ఎజెండానే వైయస్‌ఆర్‌సిపి జెండా:
దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ఎజెండానే వై‌యస్‌ఆర్‌సిపి జెండా అని నాగిరెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌సిపిని స్థాపించారని తెలిపారు.

రాష్ట్రంలో తు‌ఫాను, వర్షాభావం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు బ్యాంక్ రుణాలను మాఫీ చేసి ఆదుకోవాలని ‌నాగిరెడ్డి డిమాండ్ చేశారు. అవంతీపురం వ్యవసాయ మార్కె‌ట్‌లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులను ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్వింటాలుకు రూ.1,500 బోనస్ ప్రకటించాలని ఆందోళన చేస్తు‌న్న పత్తి రైతులకు వైయస్‌ఆర్‌సిపి రైతు విభాగం అండగా ఉంటుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top