దేశం మొత్తంలో 31వ స్థానం..!
ఏపీ అక్షరాస్యతలో వెనకబడింది. విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించడంతో అట్టడుగుకు పడిపోయింది. 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 31వస్థానంలో ఉంది. ఇందుకు ప్రభుత్వ అసమర్థతే కారణం. 2019 నాటికి 100 శాతం అక్షరాస్యత సాధిస్తామని విశాఖలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చేశారు. కార్పొరేట్ , హైటెక్ విధానాల ద్వారా అభివృద్ధి సాధించలేమని చంద్రబాబు గుర్తించడం లేదు. కంప్యూటర్లు, ట్యాబ్ ల ద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించలేమనే విషయాన్ని ముఖ్యమంత్రి తెలుసుకోవడం లేదు.
విద్య ప్రభుత్వ బాధ్యతకాదు అంటూ తిలోదకాలు..!పైగా, విద్య ప్రభుత్వ బాధ్యత కాదు..కార్పొరేట్లు సామాజిక బాధ్యతగా తమ భుజస్కందాలపై వేసుకోవాలంటూ చంద్రబాబు కొత్త స్టేట్ మెంట్ లు ఇచ్చేశారు. ప్రపంచదేశాల్లో ఇలాగే జరుగుతోంది. ఇందుకోసం ప్రైవేటు దాతలంతా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలంటూ చెప్పుకొచ్చారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపామని, త్వరలోనే అక్కడ కూడా ఆమోదం లభిస్తుందని విద్యకు తిలోదకాలిచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు.