ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

వెలగపూడిః ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. శుక్రవారం ఆక్వాఫ్యాక్టరీ ఘటనపై సభ దద్దరిల్లింది. ఐదుగురిని బలితీసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిపోయి....వారిని ప్రభుత్వం వెనకేసుకురావడం పట్ల ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆక్వా ప్రమాద ఘటనను కప్పిప్పుచ్చేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. సమస్యను పక్కదారిపట్టించేందుకు అధికార పార్టీ సభ్యులు వైయస్ జగన్ పై వ్యక్తిగత దూషలకు దిగారు.

Back to Top