() సంక్షేమ ఫలాలు అందించటానికి ఎమ్మెల్యేలు పనికిరారా() టీడీపీ నేతలకే నిధులన్నీ ఇస్తారా() రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తారాహైదరాబాద్) నియోజక వర్గ అభివ్రద్ధికి నిధులు ఇవ్వటంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయ పడ్డారు. దీని మీద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రజల ఓటుతో శాసనసభలోకి అడుగుపెట్టినా.. అదే సభ తమ బాధ్యతలు, ప్రజలకు సేవ చేసే అవకాశం నుంచి తమను తొలగిస్తోందని ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైన తాము ఆయా ప్రజలకు కావల్సిన మౌళిక సదుపాయాలను సమకూర్చడానికి అనర్హులమని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాలవరదరాజులు తనపై పోటీ చేసి ఓడిపోతే ఆయన పేరు మీద టీడీపీ సర్కార్ 42 పనులకు గాను రూ. 2కోట్లు కేటాయించారని, వరదరాజులకు మద్దతు తెలిపిన టీడీపీ నాయకుడు లింగారెడ్డి పేరు మీద 23 పనులకు గాను కోటి రూపాయలు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నికైన తనకు మాత్రం ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండా చేసిన విషయాన్ని ప్రొద్దుటురు నియోజకవర్గ ప్రజలు గమనించాలని కోరారు. ప్రజల ఆకాంక్ష మేరకు పని చేయలేకపోతున్నాను అంటే అది నా బాధ్యత రాహిత్యం కాదని కేవలం అధికార ప్రభుత్వ నిరంకుశ వైఖరి అని తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులందరం నియోజకవర్గాల అభివృద్ధి కోసం గట్టిన పట్టుబట్టామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేయడానికి ఏవిధంగా అర్హుడిని కాదో.. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి పనికిరానని చెబుతున్నారో మరి వారే తనకు ఎమ్మెల్యేగా రూ. 2లక్షల గౌరవ వేతనం ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నంత వరకు ఎమ్మెల్యేలకు ఫండ్స్ రిలీజ్ చేయమని, స్పెషల్ డెవలప్‌మెంట్ ద్వారా తమకు నచ్చిన వారికే నిధులు కేటాయిస్తామని యనమల చెప్పడం సిగ్గు చేటని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఫండ్స్ విడుదల చేయకుండా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను, వారికి ఓట్లు వేసిన కోట్లాది ప్రజలను అవమానించడమేనని రాచమల్లు నిప్పులు చెరిగారు. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేలకు కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేసిన విషయం గుర్తు చేశారు. రాష్ట్రం ఎంతగానో అభివృధ్ధి చెందుతుందని చెబుతుంటే వినేవారు మూర్ఖులా అని ప్రశ్నిచారు. 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి గట్టిగానే బుద్ది చెబుతారని, ప్రభుత్వంలో మార్పు వచ్చి అన్ని పార్టీ ఎమ్మెల్యేలను సమదృష్టితో చూడాలని ఆయన చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకు కాకుండా తమకు ఇష్టం వచ్చిన వారికి నిధులు కేటాయిస్తామనేది ఎలా సాధ్యమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 74 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ. 2 కోట్లు చొప్పున, ఇతరులకు 24మందికి గానూ రూ. 54 కోట్లు ఇచ్చినట్లు కనబడుతుందని ఆయన అన్నారు. కాగా ఈ 74, 24 నియోజకవర్గాల లెక్కల్ని గమనించినట్లయితే మొత్తం ఒకే పార్టీ వారికి కేటాయించారని చెప్పారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాకుండా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కాబోయే ఎమ్మెల్యేలు అనుకుంటున్నారో వారి పేర్లు ఉన్నాయని ఆయన వివరించారు. శాసనసభ చేయాల్సిన పని మొత్తం ఎక్కువ శాతం ఎగ్జిక్యూటివ్‌గా మారుతుందని, ఇది గత 20 నుంచి 30 సంవత్సరాలుగా జరుగుతుందని, నియోజకవర్గ అభివృద్ధి విషయానికొస్తే ఎంపీ నిధులుగానీ, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాల పండ్స్ చూసినట్లయితే చిన్నచిన్న పనులను ఎప్పుడు ప్రజాప్రతినిధులనే నియమిస్తారని ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా వారు ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత ఉంటుంది కాబట్టి దీనిని అమలు చేస్తున్నారన్నారు. కేరళ రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన వారైనా ఒక్కసారి శాసనసభ్యుడిగా ఎన్నికైతే సంవత్సరానికి రూ. 5 కోట్లు ఇస్తున్నారని, ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సంవత్సరానికి రూ. 4 కోట్లు, తమిళనాడు రూ. 2 కోట్లు, ఒరిస్సా రూ. 2 నుంచి 3 కోట్లు, బీహార్ రూ. 2 కోట్లు, మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు శాసనసభ్యులకు ఫండ్ప్ రూపంలో అందజేస్తుందని, అలాంటిది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇది అమలు జరగకపోవడం దారుణమైందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పక్కరాష్ట్ర ఎంపీ కవితను ఒక సీనియర్ జర్నలిస్ట్ మీది నూతనంగా ఏర్పడిన రాష్ట్రం కాదా మరి మీకు ఎంపీ, ఎమ్మెల్యే నిధులు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నిస్తే దానిని ఎంపీ కవిత జవాబు చెబుతూ ఒక ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో ఒక్కసారి పర్యటిస్తే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే ఎంతకష్టమో అర్థమవుతుందని, పెళ్లితంతు నుంచి మొదలు పెడితే గుడి నిర్మాణం, నల్లా కనెక్షన్‌ల వరకు ప్రజలు వారి సమస్యలను విన్నవిస్తారని దానికి ప్రభుత్వ అధికారుల మాదిరిగా ఇది నా డిపార్ట్ మెంట్ కాదనే అవకాశం ఉండదని, ఎంతో కొంత బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్ తీసేసి స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ అని మొదలు పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి పేరు చెబితే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేయాల్సి వస్తుందని అదే ఎస్‌డీఎఫ్ పేరు పెడితే చంద్రబాబుకు నచ్చినవారికి ఇవ్వొచ్చు అనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తుందని విమర్శించారు. గత సంవత్సరంలో రూ. 385 కోట్లు కేటాయించి అందులో రూ. 200 కోట్లు డిఫ్సర్స్‌మెంట్ జరిగిందని, ఈ సంవత్సరం రూ. 354 కోట్లు కేటాయించారని మరి బడ్జెట్ చర్చలో ఎందుకు చేర్చలేదని నిలదీశారు. అంతేకాకుండా నియోజకవర్గాల్లో మరి ఇంచార్జ్‌లకు బాధ్యతలు అప్పగిస్తున్నాం అంటున్న అధికార సర్కార్ అసలు వారిని నియమించేందుకు సీఎంకు ఏ అర్హత ఉందని ప్రశ్నించారు