అమ్మ హస్తం కాదు సరకుల పొట్లం

యనమదల(నూజివీడు) 13 ఏప్రిల్ 2013:

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన అమ్మ హస్తం పథకాన్ని శ్రీమతి షర్మిల సరుకుల పొట్లంగా అభివర్ణించారు. జగనన్న సీఎం అయితే రైతే రాజవుతాడని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టిన దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల కృష్ణా జిల్లా నూజివీడు నియోజకర్గంలోని యనమదల గ్రామంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన రచ్చబండలో ప్రసంగించారు. మహిళలు సమస్యలు విని ఓపికగా సమాధానాలు చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబే ఆదర్శమని ఎద్దేవా చేశారు. బాబు , కిరణ్ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. జగనన్న సీఎం అయితే మహిళలకు వడ్డీలేని రుణాలను ఇస్తారనీ, విద్యర్థులకు ఫీజు రీయింబర్సుమెంటు పథకం పూర్తిస్థాయిలో అమలవుతుందనీ ఆమె హామీ ఇచ్చారు.స్కూల్
విద్యార్థికి నెలకు రూ.500 తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని, ఇంటర్
విద్యార్థికి రూ.700, డిగ్రీ విద్యార్థికి రూ.1000 ఇస్తామని ఆమె
వివరించారు. పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

Back to Top