నిరుద్యోగుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం

  • పాదయాత్రలో బాబు బండారాన్ని బయటపెడతాం
  • రాష్ట్రంలో దుష్టపరిపాలన జరుగుతోంది
  • నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత
  • వైయస్ జగన్ పాదయాత్రతో టీడీపీ గుండెల్లో వణుకు మొదలైంది
  • ప్రత్యేకహోదా వచ్చేవరకు వైయస్సార్సీపీ పోరాడుతుంది
  • దోపిడీ పాలన అంతం కోరుకునే వారంతా జగన్ కు ఆశీస్సులందించాలి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు 
హైదరాబాద్ః రాష్ట్రంలో దుష్టపరిపాలన కొనసాగుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారనగానే టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు. ఆ భయంతోనే వైయస్ జగన్ పై నేతలంతా కలిసి ఒక్కసారిగా దాడికి దిగుతున్నారని ఫైర్ అయ్యారు. వైయస్ జగన్ పై కేసులుంటే పాదయాత్ర ఎలా చేస్తారంటూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై అంబటి కౌంటర్ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తుంటే మీరెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నారని, మీ బండారం బయపడుతుందని భయమా అని ప్రశ్నించారు. వైయస్ఆర్ మరణానంతరం వైయస్ జగన్ ఓదార్పు యాత్ర ప్రారంభించాక, వైయస్సార్సీపీ పెట్టబోతున్నారని తెలిసాక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై కేసులు పెట్టించింది వాస్తవం కాదా అని నిలదీశారు. శంకర్రావు, టీడీపీలోని వ్యక్తులు పెనవేసుకొని జగన్ మీద పిటిషన్ లు పెట్టి కేసులు వేయించి అక్రమంగా 16 నెలలు జైల్లో ఉంచారన్నారు. వైయస్ జగన్ పై ఉన్న కేసులు కక్షపూరితంగా పెట్టిన రాజకీయమైన కేసులని, జగన్ ను రాజకీయంగా ఇబ్బందిపెట్టేందుకు టీడీపీ, కాంగ్రెస్ లు కుట్ర పన్ని పెట్టిన కేసులని అంబటి అన్నారు. జగన్ జైలుకు వెళితే తప్ప బతికి బట్టకట్టలేమనే ఆలోచనలో  మీరు ఉన్నారా బాబూ..? దేశంలో న్యాయస్థానాలు నిర్దోషులను ద్రోహులుగా చిత్రీకరించలేవన్న సంగతి పాలకులు తెలుసుకోవాలన్నారు. జగన్ ను జైలుకు పంపిస్తే శాశ్వతంగా నేనే అధికారంలో ఉండవచ్చని బాబు భావిస్తున్నారేమో. అది సాధ్యం కాదని అంబటి అన్నారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే....కోర్టు ఆదేశాలకు లోబడి  మేం పాదయాత్ర చేయబోతున్నాం. అవకాశం ఇవ్వండని అడుగుతాం. పాదయాత్ర తప్పనిసరిగా జరుగుతుందని భయపడే టీడీపీ నేతలు వైయస్ జగన్ పై బురదజల్లుతున్నారు. బాబు, లోకేష్ లు అవినీతిపరులు కాదట. ఏనాడు మంత్రి, ముఖ్యమంత్రి చేయని జగన్ అవినీతిపరుడట. యువభేరి, హోదా అడిగే హక్కు జగన్ కు లేదట. మీరు వాగ్ధానం చేస్తే మేం హోదాను అడుగుతున్నాం. మమ్మల్ని ఎవరూ రాజీనామా చేయమని అడగలేదు. రాజీనామాలు చేస్తే హోదా ఇస్తామని బాబు గానీ,  మోడీ గానీ ఎవరూ చెప్పలేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉందని భావించి, అవసరమైతే రాజీనామాలను విసిరైనా హోదా సాధిస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. మీరు చెప్పగానే రాజీనామా చేయాలా బాబూ..? దానికో ప్రాసెస్ ఉంటుంది. యువతకు హోదా గొప్పతనాన్ని చెప్పేందుకే యువభేరి నిర్వహిస్తున్నాం. యువభేరిలు జరిగిన తీరు చూసి మీరు ఒత్తిడికి గురవుతున్నారు.  హోదాను తీసుకురావడంలో బాబు విఫలమయ్యారు కాబట్టి యువకులు, నిరుద్యోగులు టీడీపీని ఓడిస్తారన్న భయం పట్టుకుంది. యువకులను మీం మోసం చేస్తున్నామట. ఇవాళ ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. బీటెక్ నిరుద్యోగి వడ్డే నవీన్, ఎమ్మెస్ గోల్డ్ మెడలిస్ట్ గాంధీ ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్నాడు. జాబు రాకమరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటివరకు రైతుల ఆత్మహత్యలనే చూశాం. ఇవాళ నిరుద్యోగులు, విద్యార్థులు మరణించే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. బాబు వచ్చాడు... జాబు రాలేదు, 2వేల నిరుద్యోగ భృతి రాలేదు కాబట్టి రాష్ట్రంలో ఈ పరిస్థితులు. ప్రత్యేకహోదా వచ్చి ఉంటే ఇలాంటి వారికి ఉద్యోగాలు వచ్చేవి. అందరికీ రాకపోయినా ఉద్యోగాలొస్తాయన్న ఆశతో బతికేవారు. కానీ మరణిస్తున్నారు. దీనికి బాబు, టీడీపీ సర్కార్ బాధ్యత వహించాలి. 

హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఉద్యమాలు చేస్తున్నాం. బాబు జాబు ఇవ్వకపోతే. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే మోసం చేసినట్టు కాదట. మేం యువభేరిలు పెడితే మోసం చేసినట్టట. ఇంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితికి టీడీపీ రావడం బాధాకరం. రాష్ట్రానికి హోదా సాధించేంతవరకు వైయస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది. పాదయాత్రలో కూడ హోదా వల్ల రాష్ట్రానికి జరిగే మేలు గురించి వివరిస్తూనే ఉంటాం. చంద్రబాబు ప్రజలకు కనబడకుండా, మీడియాను కట్టడి చేస్తూ అనేక దోపిడీలు, అన్యాయాలు చేస్తున్నారు . బాబూ మట్టి, ఇసుకను దోచేసినా, పోలవరంలో వేలకోట్లు కాజేసినా, కాంట్రాక్టర్ల దగ్గర ప్రతి పనిలో వేలకోట్లు కొట్టేసినా....ఎక్కడ పత్రికల్లో, టీవీల్లో రాకుండా మేనేజ్ చేస్తూ అంతా బాగుందని ప్రజలను మభ్యపెడుతున్నారు. బాబు నిజస్వరూపం బయటపెట్టేందుకే వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారు. టీడీపీ సర్కార్ బండారాన్ని బయటపెడతాం. బాబు దుష్టపరిపాలనను వివరించేందుకు, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ నవంబర్ 2 నుంచి సాహసమైన పాదయాత్రను ప్రారంభించబోతున్నారు.  దోపిడీ పరిపాలన అంతం కావాలని కోరుకునేవారి అందరి ఆశీస్సులు కావాలి. జగన్ పై అవాకులు, చెవాకులు పేలి పవిత్ర పాదయాత్రను అపవిత్రం చేయాలని చూస్తే చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. విద్యార్థులు,యువకులు, నిరుద్యోగులు ప్రభుత్వం మీద ఆశలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరస్థితి ఉంటే... లోకేష్ లక్ష ఉద్యోగాలు ఇచ్చామంటూ అబద్ధాలు చెబుతున్నాడు. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటడం లేదు. మూడున్నరేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలిచ్చారు, ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు. అన్నీ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. 

Back to Top