ఆదివారానికి 523.5 కిలోమీటర్లు నడిచిన షర్మిల

ఐజ (పాలమూరు జిల్లా), 25 నవంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారంనాటి షెడ్యూల్‌ పూర్తయింది. మహబూబ్‌నగర్‌ జిల్లా ఐజ మండలంలోని డింగిదొడ్డి వద్ద ఏర్పటు చేసిన బసకు షర్మిల రాత్రికి చేరుకున్నారు. ఈ రాత్రికి ఆమె ఇక్కడే బసచేస్తారు. అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానికి వెనక నుంచి మద్దతుగా నిలుస్తున్న ప్రధాన ప్రతిపక్షం తీరుకు నిరసనగా జగన్‌ తరఫున షర్మిల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారంనాడు 39వ రోజు మరో ప్రజాప్రస్థానం పూర్తయ్యే సరికి షర్మిల మొత్తం 523.5 కిలోమీటర్లు నడిచారు.

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం వెంకటాపురం స్టేజీ నుంచి ప్రారంభమైంది. అనంతరం పర్దీపురం, ఉప్పల్ క్రా‌స్ రో‌డ్డు మీదుగా ఐజ వరకు కొనసాగింది. ఐజలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో షర్మిల అశేషంగా హాజరైన అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. షర్మిల ఆదివారంనాడు మొత్తం 15 కిలోమీటర్లు నడిచారు.
Back to Top