4న తూ.గో.జిల్లాలోకి మరో ప్రజాప్రస్థానం ప్రవేశం

తణుకు (ప.గో.జిల్లా) :

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న సుదీర్ఘ, చారిత్రక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జూన్‌ 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నది. అప్పటికి ఆమె 10 జిల్లాలలో పాదయాత్ర పూర్తి చేసుకొని 11వ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలోకి అడుగుపెట్టబోతోంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ఈ విషయం మీడియాకు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు బ్రిడ్జి దాటుకొని ముందుకు సాగడం ద్వారా శ్రీమతి షర్మిల తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెడతారన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆమె మొత్తం 20 రోజుల పాటు, 275 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని ఆయన వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారని ఆయన చెప్పారు.

 2.180.2 కిలోమీటర్లు పూర్తయి పాదయాత్ర :
శుక్రవారం 165వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముగిసే సమయానికి మొత్తం 2,180.2 కిలోమీటర్లు పూర్తయింది. శుక్రవారంనాడు ఆమె మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు.

Back to Top