29న వైయస్ఆర్ కాంగ్రెస్‌లోకి జిట్టా

హైదరాబాద్: నల్గొండ జిల్లాకు చెందిన యువ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 29న ఆయన పార్టీలో చేరనున్నారు. భువనగిరిలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. భువనగిరిలో ఆరోజు నిర్వహించే బహిరంగ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు పాల్గొంటారనీ, ఆమె సమక్షంలో తాను పార్టీలో చేరతాననీ జిట్టా చెప్పారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడైన జిట్టా ఇటీవలే విజయమ్మను కలసి, పార్టీలో చేరాలనుకుంటున్న అంశాన్ని ప్రస్తావించారు. గత పన్నెండు సంవత్సరాలుగా ఆయన రాజకీయాలలో పాల్గొంటున్నారు. తనతోపాటు వందలాది కార్యకర్తలు కూడా ఆ రోజున పార్టీలో చేరతారని జిట్టా వెల్లడించారు.

Back to Top