173వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర

రాజానగరం, 08 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి  వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 173వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ఆమె తన పాదయాత్రను ముక్కినాడ నుంచి ప్రారంభించారు. అక్కడ్నుంచి పేరా రాంచంద్రపురం, దొప్పలపూడి, ఇందిరా నగర్‌, అనపర్తి-దేవీ చౌక్‌, పొలమూరు పాకల మీదుగా సాగుతుంది. అనపర్తి-దేవీచౌక్‌లో సాయంత్రం ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.శనివారం శ్రీమతి షర్మిల 13.1 కిలో మీటర్లు నడవనున్నారు.

Back to Top