149వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర

చింతలపూడి(పశ్చిమ గోదావరి జిల్లా), 15 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్‌ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం నాటికి 149వ రోజుకు చేరింది.  పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం శ్రీమతి షర్మిల ముత్యాలంపేట నుంచి పాదయాత్రను ప్రారంభించారు. టి నరసాపురం, గురవయ్యపాలెం వరకు పాదయాత్ర చేసిన అనంతరం భోజన విరామం  తీసుకుంటారు. తర్వాత ఏపుగుంట, శ్రీరామవరం, తిరుమలదేవిపేట, మధ్యాహ్నపువారిగూడెం వరకు పాదయాత్ర చేస్తారు. రాత్రికి మధ్యాహ్నపువారిగూడెంలో బుధవారం రాత్రికి బస చేస్తారు.

Back to Top