143వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర

ఖమ్మం, 09 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురువారంనాటికి 143వ రోజుకు చేరుకుంది. మైబూబ్‌నగర్ క్రాస్ రోడ్డు నుంచి యాత్ర ప్రారంభమైంది.  ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.  లింగగూడెం క్రాస్ రోడ్‌,  ఉప్పలచెలక, రంగారావు బంజెర, ఎడ్ల బంజెర మీదుగా.. విఎం బంజారా చేరుకుంటారు. అక్కడ శ్రీమతి షర్మిల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గురువారం ఆమె మొత్తం  11.8 కిలోమీటర్లమేర పాదయాత్ర చేయనున్నారు.

Back to Top