రైతుల ధర్నాకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

విజయనగరం: చీపురుపల్లి మండల కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. మూడు రోడ్ల జంక్షన్‌లో ధాన్యం బస్తాలకు రైతులు నిప్పటించారు. గత మూడు నెలల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వాలని డిమాండు చేశారు. రైతులకు మద్దతుగా ధర్నాలో వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 

Back to Top