నేడు వైయ‌స్ఆర్‌సీపీ శాసనసభా పక్ష సమావేశం 

తాడేప‌ల్లి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్ష సమావేశం గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ  ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం మూడు గంటలకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ తెలిపింది.   

Back to Top