ప్రజా సంక్షేమమే జననేత ధ్యేయం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేత రెడ్డి శాంతి

శ్రీకాకుళం: ప్రజల సంక్షేమమే ధ్యేయం, అభివృద్ధే కర్తవ్యంగా చిత్తశుద్ధితో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నారని పార్టీ నేత రెడ్డి శాంతి అన్నారు. తన కుటుంబాన్ని వదిలి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఐదు కోట్ల మంది ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జననేత చేపట్టిన పాదయాత్ర ఆఖరి అంకానికి చేరిందన్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని వైయస్‌ జగన్‌ బస శిబిరం వద్ద రెడ్డి శాంతి మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు అధికార పార్టీ నుంచి కూడా భారీగా వలసలు మొదలయ్యాయన్నారు. జననేతను ముఖ్యమంత్రిని చేయాలని, ఇచ్ఛాపురంలో వైయస్‌ఆర్‌ సీపీ జెండాను ఎగురవేయాలని కవిటి మండలం ఎంపీపీ వైయస్‌ఆర్‌ సీపీలో చేరారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే జీవితాలు బాగుపడతాయని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. 

 

Back to Top