వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం వెనుక బాబు హస్తం

న్యాయం కోసం కోర్టుకు వెళ్లి పోరాడం

ఎన్‌ఐఏ ఎంక్వైరీకి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు

వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత మహ్మద్‌ ఇక్బాల్‌

హైదరాబాద్‌: ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. హత్యాయత్నం జరిగిన నాటి నుంచి చంద్రబాబు ప్రవర్తన, డీజీపీ స్టేట్‌మెంట్‌ అనేక అనుమానాలకు తావిచ్చాయని, అందుకే కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాటం చేశామన్నారు. ఎన్‌ఐఏ ఎంక్వైరీ అంటే చంద్రబాబు ఎందుకు జంకుతున్నారో చెప్పాలన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇక్బాల్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ మీడియా ముందుకు వచ్చి నిందితుడు ఎస్సీ అని, వైయస్‌ఆర్‌ సీపీ అభిమాని అని, చిన్న కత్తి అని అవహేళన చేస్తూ మాట్లాడారన్నారు. అదే విధంగా చంద్రబాబు కోడి కత్తి అంటూ డ్రామాలాగా అభివర్ణించాడన్నారు. వీరి ప్రవర్తనతో అనుమానం బలపడిందన్నారు. వైయస్‌ జగన్‌కు వస్తున్నప్రజాదరణ చూసి ఓర్వలేక ఓడిపోతామని భయం పుట్టి ఆపరేషన్‌ గరుడ పేరుతో హత్యాయత్నం చేశారన్నారు.  

గంటలోపే గరుడ పక్షిని పెట్టి మార్ఫింగ్‌ ఫ్లెక్సీలు తయారు చేయించారని ఇక్బాల్‌ మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ ఫ్లెక్సీలు బ్లూ కలర్‌లో ఉంటాయని, ఆ ఫ్లెక్సీ పచ్చరంగులో ఉందన్నారు. ప్రీ ప్లాన్డ్‌గా అటాక్‌ చేశారని, అదృష్టవశాత్తు వైయస్‌ జగన్‌ తప్పించుకున్నారన్నారు. నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉందని, జనవరి నుంచి కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడన్నారు. శ్రీనివాసరావు పనిచేసే ఫ్యూజన్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌చౌదరి నారా చంద్రబాబు, లోకేష్‌ అనుచరుడన్నారు. వైయస్‌ జగన్‌ విశాఖ ఎయిర్‌పోర్టుకు ఎంటర్‌ అయిన నాటి నుంచి సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్నారు. విశాఖ పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో జననేతపై జరిగింది హత్యాయత్నం అని క్లియర్‌గా చెప్పారని, ఆ తరువాత రిపోర్టు మార్చి ఇందులో వైయస్‌ఆర్‌ సీపీ పాత్ర లేదని తేల్చారన్నారు. 

చంద్రబాబు ప్రవర్తన, డీజీపీ వైఖరి చూసిన తరువాత కోర్టును ఆశ్రయించామని ఇక్బాల్‌ అన్నారు. లైన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ చంద్రబాబు ఇచ్చిన తరువాత న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని, అందుకే కోర్టుకు వెళ్లి థర్డ్‌ పార్టీతో విచారణ చేయించాలని కోరామన్నారు. హైకోర్టు వాదనలు విన్న తరువాత సెక్షన్‌ 5, 7 కింద కేసు టేకప్‌ చేస్తారా అని ఎన్‌ఐఏను అడిగిందన్నారు. జనవరి 1వ తేదీన ఎన్‌ఐఏ ఎఫ్‌ఐఆర్‌ రిజిస్ట్రర్‌ చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెదరాయుడు సినిమాలో విలన్‌లా చట్టాలు తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని ఇక్బాల్‌ మండిపడ్డారు. చంద్రబాబు ఎన్‌ఐఏ విచారణకు కూడా ఎవరూ సహకరించకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాడన్నారు. హత్య కుట్ర వెనుక చంద్రబాబు లేకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పరిటాల హత్య జరిగితే వెంటనే సీబీఐ ఎంక్వైరీ వేశారని గుర్తు చేశారు

Back to Top