అనంతపురం: కార్పొరేషన్ పరిధిలోని 62వ డివిజన్‌లో వైయస్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థి బిందు ప్రియా ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిశారు. ‘ఫ్యాన్ గుర్తుకు’ ఓటు వేసి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.