1న ‘వైయ‌స్ఆర్‌ సంపూర్ణ పోషణ’ ప్రారంభం

సెప్టెంబర్ నుంచి ఇంటికే  రేషన్‌..

మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ

 అమరావతి: సెప్టెంబర్‌ 1న ‘వైయ‌స్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని’ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రూ.1,863 కోట్లతో 30లక్షల మందికి పౌష్టికాహారం అందిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ నుంచి రేషన్‌ను ఇంటికే పంపిణీ చేస్తామని తెలిపారు. 50 శాతం మంది మహిళల్లో రక్త హీనత ఉందని.. గర్భిణీలు, మహిళలు, పిల్లల్లో రక్తహీనత నివారించేందుకే ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టబోతున్నామని.. 55 వేల అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ల తరహాలో విద్య అందిస్తామని అనురాధ పేర్కొన్నారు

తాజా వీడియోలు

Back to Top