నేడు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలతో వైయ‌స్‌ జగన్‌ భేటీ 

 
తాడేప‌ల్లి: ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలతో పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అవుతున్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. 
పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే క్రమంలో.. నేటి వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కీలకం కానుంది. సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు వైయ‌స్ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 

Back to Top