త్వ‌ర‌లో ఉల్లందూరుపేట‌, జ‌మ్మూ క‌శ్మీర్‌లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణం

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి 

 తిరుమల: త్వరలో త‌మిళ‌నాడు రాష్ట్రంలోని ఉల్లందూరుపేట, జమ్మూకశ్మీర్‌లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మ‌న్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమిళనాడులో నిర్మించే శ్రీవారి ఆలయానికి భక్తులు  భారీ విరాళం అందజేశారు. ఉల్లందూరుపేలో నిర్మించే శ్రీవారి ఆలయానికి రూ.3.16 కోట్లతో పాటు రూ.20 కోట్ల విలువైన భూమిని విరాళంగా తమిళనాడు భక్తులు అందజేశారు. టీటీడీ పాలక మండలి సభ్యులు కుమారగురు ఆధ్వర్యంలో విరాళాన్ని భక్తులు అందజేశారు. స్వర్ణ తిరుమల అతిథి గృహంలో శనివారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విరాళ డీడీని పాలక మండలి సభ్యులు కుమారగురు అందించారు.  

Back to Top