‘నా మనవడ్ని చూసేందుకు వచ్చాను’

బాపట్ల: మేదరమెట్ల వద్ద ఆదివారం నిర్వహించిన సిద్ధం సభలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారని తెలుసుకున్న 70 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలు ఉదయం 7గంటలకే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఉదయాన్నే సభావేదిక వద్ద వృద్ధురాలు కలియతిరగడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడే ‘ఎందుకు వచ్చావ్‌ అవ్వా’ అని అడిగిన వారందరికీ ‘మా ఆలన పాలన చూస్తున్న నా మనవడిని చూసిపోయేందుకు వచ్చా’నని బదులిచ్చింది. సభా ప్రాంగణంలో ఉన్న ఈ వృద్ధురాలి ఫొటో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండింగ్‌ అవుతోంది.

Back to Top