‘పచ్చి అబద్ధాల’ పోటీలో బాబు, ప‌చ్చ మీడియాకే ఫస్ట్ ప్రైజు 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌:  ప్ర‌భుత్వంపై అస‌త్య ప్ర‌చారం చేస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌, ఓ వ‌ర్గం మీడియా తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎండ‌గ‌ట్టారు. కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా హోరెత్తించిన అసత్యపు ప్రచారం ఈ ఏడాది ప్రపంచస్థాయి ‘పచ్చి అబద్ధాల’ పోటీలో ఫస్ట్ ప్రైజుకు ఎంపికైనట్టే. కొన్నేళ్లుగా ఈ పురస్కారం బాబు, పచ్చ పార్టీ ప్రముఖులకే దక్కుతుండటం తెలుగు ప్రజల గ్రహచారం అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కరోనా కట్టడి, చికిత్సకు రాష్ట్రం స్పందించిన తీరును ప్రధాని, కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రశంసించినా పచ్చ పార్టీ పెద్దలకు అరెస్ట్ గొడవ తప్ప మరేమీ పట్టడం లేదు. ప్రజల పట్ల ఏ బాధ్యత లేని మీకు రాజకీయాలెందుకు? రెండేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికలో వాతలు పెట్టినా బుద్ధి రాకపోతే మీ ఖర్మ! అంటూ మ‌రో ట్వీట్ చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top