నేటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా ఫీవ‌ర్ స‌ర్వే

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

విశాఖ‌:  రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఫీవర్ సర్వే ప్రారంభం కానుంది. కోవిడ్ బాధితులను ముందస్తుగా గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి జ్వర పరీక్షలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌జ‌లంద‌రూ స‌ర్వేకు స‌హ‌క‌రించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ చురుగ్గా సాగుతోంది. కేంద్రం నుంచి వచ్చే వాటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తోంది. దీంతో రాష్ట్రంలో మే 6 నాటికి 70 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింద‌ని అంత‌కుముందు చేసిన ట్వీట్‌లో విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top