ప‌ర్యాట‌క రంగానికి నిధులివ్వండి 

మంత్రి రోజా
 

విశాఖ‌: రాష్ట్రంలో పర్యాటక రంగానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని మంత్రి ఆర్‌కే రోజా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. శనివారం పోర్టు గెస్టు హౌస్‌లో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రోజా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పిలిగ్రిమ్స్, హెరిటేజ్‌ డెస్టినేషన్‌ మ్యూజియం గ్రాంట్స్‌ మంజూరు చేయాలని కోరుతూ.. డీపీఆర్‌లను కేంద్ర మంత్రికి అందజేశారు.   

అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలకు గుర్తుండేలా స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. సీఎం జగన్‌ రాష్ట్రంలోని ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయడం ఆయనకు ఇచ్చిన గౌరవమన్నారు.

అల్లూరి తిరిగిన ప్రాంతాలను టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్, నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వరుదు కల్యాణి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు,  పాల్గొన్నారు.

Back to Top