అంబేద్కర్‌ నినాదాన్ని అమలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌

మంత్రి పినిపే విశ్వరూప్‌
 

తాడేపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఇచ్చిన స్లోగన్‌ విద్య..ఆయన నినాదాన్ని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారని మంత్రి పినిపే విశ్వరూప్‌ కొనియాడారు. జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడత డబ్బులు జమ చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దివంగత మహానేత  డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆర్థిక కారణాలతో చదువును మధ్యలో ఆపేయకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2014 తరువాత ఆ పథకానికి తూట్లు పొడిచారు. మళ్లీ ఈ రోజు దేవుడి దయతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో చెల్లించడంతో పాటు బకాయిలను కూడా వైయస్‌ జగన్‌ చెల్లించారు. విద్యా దీవెనతో అన్ని కులాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేస్తున్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి పథకాన్ని పునరుద్ధరిస్తూ అమలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ ధన్యులని మంత్రి విశ్వరూప్‌ కృతజ్ఞతలు తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top