ఒంగోలు: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్ అత్యంత పారదర్శకంగా కొత్త జిల్లాలను ప్రకటించారని తెలిపారు.