వైయ‌స్ఆర్‌సీపీ నేతల అక్ర‌మ అరెస్ట్

అనంతపురం: వైయ‌స్ఆర్‌సీపీ బుక్కరాయసముద్రం మండల కన్వీనర్ గువ్వల శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చెన్నంపల్లిలో జరిగిన ఘర్షణతో ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలనే కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనతో సంబంధం లేని వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని పేర్కొన్నారు. అసలు ఘర్షణకు సంబంధించిన వాస్తవాలను పక్కనపెట్టి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు.
 

Back to Top