పొగాకు పంటకు నిప్పు 

పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టిన టీడీపీ మూక‌లు

నంద్యాల జిల్లా:  అధికార పార్టీ నేత‌ల క‌డుపుమంట‌కు మందే లేకుండా పోయింది. ప‌చ్చ‌ని పంట‌లకు నిప్పంటించి పైశాచిక ఆనందం పొందుతున్నారు.  నంద్యాల జిల్లా గ‌డివేముల మండలం పైబోగుల గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఈశ్వరయ్య , సూరి వెంకటేశ్వర్లు అనే రైతుల కలంలో ఆర‌బెట్టిన 13 లక్షల విలువచేసే పొగాకు పంటను టీడీపీ గూండాలు పెట్రోల్ పోసి తగలబెట్టారు. కాలిపోయిన పంటను వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పరిశీలించి, రైతులను పరామర్శించారు. టీడీపీ గూండాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాంభూపాల్‌రెడ్డి డిమాండు చేశారు.

Back to Top