ప్రజలందరి జీవితాల్లో దీపావళి పండుగ వెలుగులు నింపాలి 

 మంత్రి బొత్సా సత్యనారాయణ 
 

విజయనగరం: దీపావళి పండుగ సందర్భంగా విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్తు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని మంత్రి ఆకాంక్షించారు.

చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స‌ సత్యనారాయణ అభిలషించారు.

తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు,సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని మంత్రి బొత్సా ఆకాంక్షించారు.

రాష్ట్రంలో ప్రతి ఇంటి లోగిలి కార్తీకదీపం కాంతులతో వెలగాలని అన్నదాతల కళ్ళలో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని మంత్రి బొత్సా ఆకాంక్షించారు.

అజ్ఞాన అంధకారాన్ని తొలగించి విజ్ఞాన వెలుగులను దీపావళి ప్రసాదించాలని మంత్రి కోరారు.  

Back to Top