రేపు సీఎం వైయ‌స్ జగన్‌ ప్రకాశం జిల్లా పర్యటన

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (06.03.2024 ప్రకాశం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్‌ రెండో టన్నెల్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ జాతికి అంకితం చేయనున్నారు.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్‌ ఆవిష్కరిస్తారు, తర్వాత వ్యూ పాయింట్‌ వద్ద నుంచి ప్రాజెక్ట్‌ పరిశీలన అనంతరం టన్నెల్‌ 2 ను పరిశీలిస్తారు, అనంతరం జాతికి అంకితం చేస్తారు, కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Back to Top