రేపు సీఎం వైయ‌స్ జగన్‌ విజయవాడ పర్యటన

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ‌నివారం (11.11.2023)  విజయవాడ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించనున్న భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలలో ముఖ్య‌మంత్రి పాల్గొంటారు. 
ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంకు చేరుకుంటారు, అక్కడ మైనారిటీస్‌ వెల్పేర్‌ డే, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డే సందర్భంగా భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలలో పాల్గొననున్న సీఎం, కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top