రేపు  సీఎం వైయ‌స్‌ జగన్‌ తిరుపతి పర్యటన

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  రేపు (13.12.2023) తిరుపతిలో ప‌ర్య‌టించ‌నున్నారు. శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు  ముఖ్యమంత్రి హాజ‌రుకానున్నారు.
మధ్యాహ్నం 3.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు, అక్కడ తాజ్‌ హోటల్‌లో శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న ముఖ్యమంత్రి, అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top