రాజ‌ధాని విష‌యంలో త‌మ జోక్యం ఉండ‌దు

ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిష‌న్‌

అమ‌రావ‌తి: రాజ‌ధాని విష‌యంలో త‌మ జోక్యం ఉండ‌ద‌ని  ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో కేంద్ర హోం శాఖ అనుబంధ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. రాజ‌ధాని విష‌యంలో మ‌రోసారి కేంద్రం త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. రాష్ట్రానికి ఒకే రాజ‌ధాని ఉండాల‌ని చ‌ట్టంలో ఎక్క‌డా లేద‌ని పిటిష‌న్‌లో పేర్కొంది. సెక్ష‌న్ 13 ప్ర‌కారం రాజ‌ధాని అంటే ఒక‌టికే ప‌రిమితం కావాల‌ని కాద‌న్నారు. 2018లో అప్ప‌టి ప్ర‌భుత్వం అమ‌రావ‌తిలో హైకోర్టు పెట్టింది. హైకోర్టు ఉన్నంత మాత్రాన అమ‌రావ‌తినే రాజ‌ధాని అని చెప్ప‌లేం. రాజ‌ధాని విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వానిదే అంతిమ నిర్ణ‌య‌మ‌ని కేంద్రం హైకోర్టుకు స్ప‌ష్టం చేసింది. రాజ‌ధానిపై హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వాలంటూ కేంద్రం విజ్క్ష‌ప్తి చేసింది. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top