ఏపీ హైకోర్టులో కూటమి సర్కార్‌కు ఎదురుదెబ్బ

అమరావతి : కూటమి సర్కార్‌కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ అవుతు శ్రీధర్‌ రెడ్డి రిమాండ్‌ పోలీసులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని ఆదేశిస్తూ.. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.శ్రీధర్‌ రెడ్డి అరెస్టులో పోలీసులు అత్యుత్సాహం చూపించారన్న న్యాయస్థానం.. రిమాండ్‌ విధించిన కింది కోర్టు తీరును కూడా తప్పుబట్టింది. ఇదిలా ఉంటే.. అక్రమ కేసులో అవుతు శ్రీధర్ రెడ్డిని ఫిబ్రవరి 24వ తేదీన విజయవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు ఆయనకు మార్చి 10వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. 

Back to Top