ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం

 అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఆగస్టు లో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికారవర్గాల సమాచారం. జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, ప్రీ హైస్కూళ్లు, హైస్కూళ్లు, హైస్కూల్‌ ప్లస్ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చ జరగనున్నట్లు తెలిసింది.

ఈ నెల 10న అమలు చేయనున్న  వైయ‌స్ఆర్‌ నేతన్న నేస్తం' పథకంపై చర్చించనున్నట్లు సమాచారం. పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్ఆర్‌ చెల్లింపులను కేబినెట్‌ ఆమోదించనుంది. రూ.10లక్షల పరిహారం చెల్లింపునకు రూ.550 కోట్ల విడుదలకు ఆమోదం తెలపనుంది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపులు, క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పానికి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

Back to Top