వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అంతర్వేది రథం కేసు సీబీఐకి అప్పగింత
11 Sep 2020 4:34 PM
అమరావతి : అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించిన కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం జీవో జారీ చేసింది. సెక్షన్ 6, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సీబీఐ ఈ కేసును విచారించాలని కోరింది. కాగా, సెప్టెంబర్ 5వ తేదీ శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. నిజాలు నిగ్గుతేల్చాలనే ఉద్ధేశ్యంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.