6న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: ఈ నెల 6వ తేదీ  ) సీఎం శ్రీ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11.40 – 12.10 వరకు కడప అమీన్‌ పీర్‌ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొంటారు. 12.25 – 12.45 కడప మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top