తూర్పు గోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజు శుక్రవారం ఎస్‌టీ రాజపురం ప్రాంతం నుంచి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. మరికాసేపట్లో కాకినాడ జిల్లాలో ప్రవేశించనున్న సిఎం వైయస్ జగన్ యాత్ర. సీఎం వైయస్ జగన్‌కు ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్లపై బారులు తీరిన అశేష జనవాహిని నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా.. సీఎం వైయస్ జగన్ ఎస్‌టీ రాజపురం ప్రాంతం నుంచి బయలుదేరి రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తారు అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.