విజయవాడ: వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రతి రోజు ఓ జైత్రయాత్రలా కొనసాగుతోంది. అడుగడుగునా సీఎం వైయస్ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. యాత్రలో జననేతను చూసేందుకు.. మాట కలిపేందుకు.. కరచాలనంచేసేందుకు.. వీలైతే ఫొటో దిగేందుకు స్కూలు పిల్లల నుంచి వృద్ధుల వరకు మండుటెండైనా అర్ధరాత్రయినా పోటీ పడుతుండటం ఊరూరా కనిపిస్తోంది. మేమంతా సిద్ధం 15వ రోజు ఆదివారం (ఏప్రిల్ 14) షెడ్యూల్‌ను వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శనివారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, తేలప్రోలు బైపాస్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదగా జొన్నపాడు శివారుకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ శివారు నాగవరప్పాడు వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత గుడివాడ, బొమ్ములూరు, గుడ్లవల్లేరు, వేమవరం, పెడన క్రాస్, బల్లిపర్రు, బంటుమల్లి బైపాస్ , పెండుర్రు మీదుగా సంగమూడి రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.