మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్

 మేమంతా సిద్ధం - 18వ రోజు  షెడ్యూల్తూర్పు గోదావ‌రి జిల్లా:  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్ యాత్ర జైత్ర‌యాత్ర‌లా సాగుతోంది. 18వ రోజు(శుక్ర‌వారం) షెడ్యూల్‌ను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుద‌ల చేశారు. రేపు 
ఉదయం 9 గంటలకు ఎస్ టీ రాజపురం రాత్రి బస నుంచి వైయ‌స్ జ‌గ‌న్  బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద  బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్ , కత్తిపూడి బైపాస్ , తుని బైపాస్ , పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

 

Back to Top