కలుషిత జలాలతో మంచాన పడుతున్నామయ్యా..

వైయస్‌ జగన్‌కు మహిళల గోడు...
విజయనగరంః చిన్నబుడ్డివరం,అంకువరం గ్రామ మహిళలు వైయస్‌ జగన్‌ను కలుసుకుని తమ సమస్యలు విన్నవించారు.తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైయస్‌ జగన్‌కు మొరపెట్టకున్నారు. బిందె నీళ్లు కోసం కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.కలుషితమైన నీటితో అనార్యోగం పాలవుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు.ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వాటర్‌ ట్యాంక్‌ నిర్మించి కష్టాలను తీర్చాలని కోరారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించి వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన  తర్వాత సమస్యలు పరిష్కరిస్తామన్నారు.రోడ్లు అధ్వాన్నంగా ఉండటంతో ఆర్టీసీ బస్సులు కూడా సమయానికి రావడంలేదని దీంతో కళాశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
Back to Top