ఉన్నత చదువు చదివినా ఉద్యోగం లేదన్నా...

వైయస్‌ జగన్‌ను కలిసిన నిరుద్యోగి గౌరి...
శ్రీకాకుళంః ఆమదాలవలస మండలం కృష్ణాపురానికి చెందిన నిరుద్యోగి గౌరి వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యను చెప్పుకుంది.ఉన్నత చదువులు చదివిన ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.వైయస్‌ఆర్‌ చలువతో బిటెక్‌ పూర్తి చేసానని,వైయస్‌ జగన్‌ సీఎం అయితే ప్రత్యేక హోదా సాధిస్తారని, దాంతో ఉద్యోగవకాశాలు పెరుగుతాయనే ఆశాభావంతో ఉన్నామన్నారు.టీడీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల నుంచి ఒక నోటిఫికేషన్‌ కూడా సక్రమంగా ఇవ్వలేదన్నారు.నిరుద్యోగ భృతి కూడా అందడం లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ  అధికారంలోకి వస్తే నిరుద్యోగులందరికి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నామన్నారు.

తాజా వీడియోలు

Back to Top