ఊర్లో ఉపాధి కరువై

నెల్లూరు  :‘అన్నా.. మాది అల్లూరు మండలం మట్రకోగోలు. ఆ మహా నేత వైఎస్సార్‌ ఉన్నపుడు రోజూ మా ఊర్లో ఉపాధి పనులు కల్పించేవారు. మాకు ఉపాధి లభించేది. ఇప్పుడు ఉపాధి పనులు అసలు చేయించడం లేదు. ఒకవేళ ఎప్పుడో ఓ సారి చేయించినా డబ్బులివ్వక వేధిస్తున్నారు. దాంతో ఊర్లో ఉపాధి కరువై ఇలా వలసొచ్చాం. పిల్లలనూ వెంట తీసుకొచ్చాం’ అంటూ పొట్లూరు లక్ష్మి జననేత ఎదుట వాపోయింది. మన ప్రభుత్వమొచ్చినాక మా ఊరెళతాం. బిడ్డలను చదివించుకుంటాం అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 
Back to Top