శ్రీకాకుళం: చంద్రబాబు చెప్పేవి అన్నీ అబద్ధాలే.. ఆయన మాటకు కట్టుబడి ఉండరని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. మాకు ఓటు వేయమని ఆ రోజు అడిగాం అడిగాం కనుకనే మూలపేటలో నాలుగు వేల కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం చేశాం. శ్రీకాకుళం జిల్లాను ప్రపంచం తో కనెక్ట్ చేశాం. మాకు ఓటు వేశారు కనుకనే ఉద్దానంకు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఉపరితల జలాలు అందించేందుకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేశాం అని చెబుతున్నాం. ఆ విధంగా ఆరు మండలాల సమస్యను పరిష్కరించాం అని చెబుతున్నాం. ఆ విధంగా ఈ ప్రభుత్వంలో వంశధార నీరు ఇంటింటికీ అందించాం. మాకు ఓటేశారు కనుకనే రెండు వందల కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశాం. మాకు ఓటేశారు కనుకనే శ్రీకాకుళంలో ఉన్న రిమ్స్ ఆస్పత్రిని 900 బెడ్స్ తో తీర్చిదిద్ది డాక్టర్లను రిక్రూట్ చేసి స్టాఫ్ ను రిక్రూట్ చేసి మొత్తం హాస్పిటల్ లో ఎక్విప్మెంట్ అంతా పెట్టి, మందులు నిండుగా పెట్టి ఇవాళ ఏ కేసునీ విశాఖ పట్నంకు రిఫర్ చేయకుండా ఆస్పత్రిని డెవలప్ చేశాం అని విన్నవిస్తున్నాను. ఎప్పుడయినా మీరేమయినా ఇన్ని పనులు చేశారా ? అలానే పరిపాలనను వికేంద్రీకరించాం. పాలనను మీ గుమ్మం దగ్గరకు తీసుకుని వచ్చాం. రెండు లక్షల యాభై వేల మందిని సచివాలయ వ్యవస్థ కోసం నియమించాం. ఇప్పుడు ఏ పని కావాలన్నా మండల కేంద్రానికి కానీ జిల్లా కేంద్రానికి కానీ వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇదంతా మీరు ఎన్నుకున్న ప్రభుత్వంతోనే సాధ్యం అయింది. మీరు ఓటేసి గెలిపించిన కారణంగానే సాధ్యం అయింది. మళ్లీ మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. అవినీతి రహిత పాలనకు పట్టం కట్టండి అని పిలుపు ఇస్తున్నాను.. అని మంత్రి ధర్మాన అన్నారు. తంగివానిపేటలో మంత్రి ధర్మాన ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు మీ ఎన్నికల్లో మీ సహకారం కోరేందుకు నేను ఇక్కడికి వచ్చాను. మీ గ్రామంలో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేడు ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్య జరుగుతున్నాయి. ఒక పార్టీ ఎన్నికలకు వెళ్లే ముందు మా పార్టీ నన్నూ గెలిపిస్తే ఈ కార్యక్రమాలు చేస్తాం అని ఏమయితే చెప్పారో అవి అమలు చేసి,మళ్లీ అధికారం నాకు ఇవ్వండి అని వచ్చిన వ్యక్తి ఒకరు. రెండో వైపు ఉన్న వ్యక్తి ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు అన్నీ అధికారంలో ఉండగా విస్మరించి ఏదీ చేయకుండా మాట దాటి మళ్లీ ఎన్నికలప్పుడు కొత్త వాగ్దానాల కాగితం పట్టుకుని రావడం మరోసారి మోసగించాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఇంకొకవైపు. వీళ్లిద్దరి మధ్య ఎన్నిక జరుగుతుంది. ఒక వ్యక్తి సమాజంలో ఉండే అన్ని వర్గాలూ సంతోషంగా జీవించాలి దానికి ఏం అవసరమో అనేటటువంటివి ఆలోచించి పథకాల రూపకల్పన చేసిన వారు ఒకరు. రైతులు,కూలీలు,మైనార్టీలు, ముఖ్యంగా మహిళలు ఇలా అన్ని వర్గాల క్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న సీఎం జగన్. ఇక రెండో వైపు ఉన్న వ్యక్తి బీదలకు ఏమయినా సాయం చేయాలంటే తప్పూ అనేటటువంటి వ్యక్తి. పథకాల పేరిట ధనం వృధా చేసేస్తున్నారు అని చెప్పినటువంటి వ్యక్తి. పెద్ద ఎత్తున పెద్దవాళ్లకు కొమ్ముకాసి ప్రభుత్వ ధనాన్ని దోచి పెట్టే వ్యక్తి. వీళ్ల మధ్య ధనవంతులకూ పేదలకు జరిగిన యుద్ధం ఇది అని విన్నవిస్తున్నాను. చేయూత అనే పథకం 45 ఏళ్లు దాటిన వ్యక్తి కి ఇస్తారు. ఆ రోజు 75వేలు ఇస్తామని ఐదేళ్లూ అందించాం. ఎందుకు అందించాం అంటే ఒక ఆడ పిల్ల పెళ్లయిపోయాక అత్తవారింటికి వచ్చేశాక,ఆమెకు పిల్లలు కలిగాక, ఆ పిల్లలు పెళ్లిళ్లు అయ్యాక వారి పిల్లల పట్టింపుల్లో ఉంటారే తప్ప తల్లి యోగ క్షేమాలూ పట్టించుకోరు. అలాంటి ఆడబిడ్డల కోసం చేయూత పథకం వర్తింపజేస్తున్నాం. 45 ఏళ్లు దాటిన అరవై సంవత్సరాలు లోపు ఉన్న ఇల్లాలికి ఆర్థిక ఆసరా కల్పించాలని ఉద్దేశంతో చేయూత పథకం వర్తింప జేస్తున్నాం. అలాంటి స్త్రీలకు సంవత్సరానికి 30 వేలు చొప్పున లక్షా యాభై వేలు రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. ఈ పథకం వెనుక ఉద్దేశం ఇది. ఆ.. స్త్రీ ఎప్పుడూ కన్నీరు పెట్టకూడదు. ఎవ్వరూలేరు అని బాధపడకూడదు. తనను కనీ పెంచిన తల్లీ తండ్రీ ఎలా చూశారో వాళ్లు ఉన్నా లేకపోయినా అలానే చూడాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచన. ఇది తప్పా అని అడుగుతున్నాను ? అదే మహిళ అరవై దాటితే 3000 రూపాయలు పింఛను ఇచ్చాం. ఇప్పుడు పింఛను మొత్తం 3500 రూపాయలుగా చేశాం. వచ్చే ఐదేళ్లకూ ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయనున్నాం. అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు పింఛను 3500 ఇవ్వనున్నాం. రైతాంగానికి రైతు భరోసాను పదహారు వేలు చేయాలని భావిస్తున్నాం. అతను ఇచ్చిన మాటను నెరవేర్చారు. పెట్టుబడి సాయం అందించారు. రెండు లక్షల 75 వేల కోట్లు మీ అకౌంట్లలో వేశాం. చంద్రబాబు మీ డబ్బంతా దుర్వినియోగం అయిపోతుందని చెప్పారు. రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పారు. ఇవాళేమో మేమూ ఇస్తాం అని అంటున్నారు. జగన్ ఇచ్చినదాని కన్నా మూడు రెట్లు ఎక్కువ ఇస్తాం అని చెబుతున్నారు చంద్రబాబు. అంటే అమలు చేయగలిగేవే చెబుతున్నారు జగన్. ఇతను మూడు రెట్లు ఎక్కువ ఇస్తాం అని ఎందుకు చెబుతున్నారంటే ఇవ్వక్కర్లేదు కనుక.. అధికారంలోకి వచ్చాక హామీలు అన్నింటినీ అమలు చేయడం మరిచిపోతారు కనుక ! అందుకే సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇవాళ కలలు కంటున్నారు. జగన్ మాత్రం సాధ్యం అయ్యే మాటలే చెబుతున్నారు. సాధ్యం అయ్యేవే చేసి చూపిస్తున్నారు. హామీలు అన్నింటినీ అమలు చేసి చూపిస్తున్నారు. మీ దగ్గర హామీలు చిత్తు కాగితాల్లాంటివి అవసరం అయిపోగానే విసిరేస్తారు. ఇంతకుముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ చేశారా ? చేయలేదు. బంగారం పత్రాలు విడిపించే బాధ్యత నాది అని అన్నారా ? కానీ చేశారా ? మళ్లీ ఐదేళ్లలో ఎప్పుడయినా తంగినవానిపేటలో కనిపించారా అని అడుగుతున్నాను. ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు ఎలా నమ్మాలి. మీ ఊళ్లో ఉన్న మహిళలకు ఏం చెప్పారు ? మీరు నాకు ఓటేయండి.. డ్వాక్రా రుణాలు చెల్లిస్తానని చెప్పారా ? ఎన్నిక అయిపోయాక ఐదేళ్లూ ఆ మనిషి అడ్రస్ లేదు. ఆ బాకీ తీర్చింది జగన్. ఆసరా పేరిట మీ డ్వాక్రా రుణాలు తీర్చేశారు. ఇప్పుడు ఉద్యోగాలు గురించి చెబుతున్నారు ఆయన,ఆయన కొడుకు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పారు. 2014 - 19 మధ్య కాలంలో ఏమయిపోయాయి మీ మాటలు అని ప్రశ్నిస్తున్నాను. ఒక్కరికైనా తంగివానిపేటలో ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నాను ? ఆయన జేబు నుంచి ఒక్క ఉద్యోగం అయిన తీసి ఇచ్చారా అని అడుగుతున్నాను ? ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన మీకు ఏనాడయినా ఉందా ? డబ్బంతా తీసుకుని వెళ్లి అమరావతి నిర్మాణానికి పెట్టేసి ఇతర ప్రాంతాల అభివృద్ధి అన్నది పట్టకుండా మీకు ఆ రోజు మరో ఆలోచన అన్నది లేకుండా ఉంది. కేంద్రం ఇచ్చిన విభజన తరువాత 23 సంస్థలు ఇచ్చారు. కానీ వాటిలో ఒక్కటైనా ఈ ప్రాంతానికి ఇచ్చారా ? ఇవాళ నాయకులు కొందరు నాకు ఎంపీకి ఓటు వేయండి. ఎమ్మెల్యేకు ఓటు వేయండి అని వస్తున్నారు. ఏనాడయినా మీరు 23 సంస్థలలో ఒక్క సంస్థ అయినా ఇక్కడ ఎందుకు పెట్టలేదు అని మీ అధినేతను అడిగారా ? అడగలేదు. నోరు లేదు. అమాయకం అయిన ప్రజల దగ్గర నాయకుల దగ్గర మీ నాటకాలు చెల్లుతాయి. మాకు ఓటు వేయమని ఆ రోజు అడిగాం అడిగాం కనుకనే మూలపేటలో నాలుగు వేల కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం చేశాం. శ్రీకాకుళం జిల్లాను ప్రపంచం తో కనెక్ట్ చేశాం. మాకు ఓటు వేశారు కనుకనే ఉద్దానంకు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఉపరితల జలాలు అందించేందుకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేశాం అని చెబుతున్నాం. ఆ విధంగా ఆరు మండలాల సమస్యను పరిష్కరించాం అని చెబుతున్నాం. ఆ విధంగా ఈ ప్రభుత్వంలో వంశధార నీరు ఇంటింటికీ అందించాం. మాకు ఓటేశారు కనుకనే రెండు వందల కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశాం. మాకు ఓటేశారు కనుకనే శ్రీకాకుళంలో ఉన్న రిమ్స్ ఆస్పత్రిని 900 బెడ్స్ తో తీర్చిదిద్ది డాక్టర్లను రిక్రూట్ చేసి స్టాఫ్ ను రిక్రూట్ చేసి మొత్తం హాస్పిటల్ లో ఎక్విప్మెంట్ అంతా పెట్టి, మందులు నిండుగా పెట్టి ఇవాళ ఏ కేసునీ విశాఖ పట్నంకు రిఫర్ చేయకుండా ఆస్పత్రిని డెవలప్ చేశాం అని విన్నవిస్తున్నాను. ఎప్పుడయినా మీరేమయినా ఇన్ని పనులు చేశారా ? అలానే పరిపాలనను వికేంద్రీకరించాం. పాలనను మీ గుమ్మం దగ్గరకు తీసుకుని వచ్చాం. రెండు లక్షల యాభై వేల మందిని సచివాలయ వ్యవస్థ కోసం నియమించాం. ఇప్పుడు ఏ పని కావాలన్నా మండల కేంద్రానికి కానీ జిల్లా కేంద్రానికి కానీ వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇదంతా మీరు ఎన్నుకున్న ప్రభుత్వంతోనే సాధ్యం అయింది. మీరు ఓటేసి గెలిపించిన కారణంగానే సాధ్యం అయింది. మళ్లీ మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. అవినీతి రహిత పాలనకు పట్టం కట్టండి అని పిలుపు ఇస్తున్నాను.. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.