రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నామినేష‌న్‌

నామినేష‌న్‌కు ముందు పులివెందుల‌లో భారీ బ‌హిరంగ స‌భ‌

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేపు నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేప‌ట్టి మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర నేటితో ముగియ‌నుంది. ఈరోజు టెక్క‌లిలో మేమంతా సిద్ధం బ‌హిరంగ స‌భ అనంత‌రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తాడేప‌ల్లిలోని త‌న నివాసానికి చేరుకుంటారు. రేపు ఉద‌యం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి క‌డ‌ప‌కు చేరుకుంటారు. క‌డ‌ప ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్ట‌ర్‌లో భాక‌ర‌పురం చేరుకుంటారు. అనంతరం సీఎస్ఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు. ప‌బ్లిక్ మీటింగ్ అనంత‌రం పులివెందుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థిగా ఉద‌యం 11 గంట‌ల ప్రాంతంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు.

Back to Top